జనరేషన్‌కి జనరేషన్‌కి మధ్య తేడాలు అనేవి ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈ మధ్య కాలంలో ఆ తేడాలు మరింత స్పష్టంగా, మరింత విస్తృతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పటి పిల్లల పెంపకం, వారి ఆలోచనల తీరు, వారి ప్రవర్తన, వారి విలువలు అన్నీ నేటి తరానికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తున్నాయి. నేటి తరం పిల్లలు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం, ఫాస్ట్ లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడిపోతూ సంప్రదాయ విలువల నుండి క్రమంగా దూరమవుతున్నారని పెద్దవారు భావిస్తున్నారు.


ఒకప్పుడు వివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి నుంచే పద్ధతి, నియమాలు, కుటుంబ గౌరవం అన్నీ కాపాడుకుంటూ ఉండే సమాజం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పవిత్ర బంధం అనేది కొందరికి కేవలం ఫ్యాషన్‌గా మారిపోయింది. పెళ్లి లేకుండానే లేదా సంబంధం లేని వ్యక్తులతోనూ శారీరక సంబంధాలు కలిగి ఉండటాన్ని సాదారణంగా చూస్తున్న సమాజం తయారైంది. ఇది కేవలం మనసుల మార్పు మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, మరియు ఓపెన్ కల్చర్ ప్రభావం అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.



సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోయిన్లు ఎంతో సంస్కారవంతులు, మర్యాదగణ్యులు. వాళ్ల వ్యక్తిత్వం, కట్టుబాట్లు చూసి జనాలు గౌరవంతో నమస్కరించాలనుకునేవారు. వాళ్లలో కనిపించే నిజాయితీ, పద్ధతి, క్రమశిక్షణ అన్నీ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. నేటి హీరోయిన్లు మాత్రం బోల్డ్ రోల్స్ చేయడంలో ఎలాంటి సంకోచం చూపడం లేదు. సినిమాల్లో బహిరంగంగా బోల్డ్ సీన్స్, లిప్‌లాక్ సీన్స్, మరియు బహిరంగ ప్రదర్శనను సులభంగా స్వీకరిస్తున్నారు. ఇది కేవలం హీరోయిన్స్ నిర్ణయం మాత్రమే కాదు, దర్శకులు మరియు నిర్మాతల డిమాండ్ కూడా. దర్శకులు కథలో మరింత ఆకర్షణ కోసం బోల్డ్ కంటెంట్‌ను జోడిస్తారు. అలాగే ప్రేక్షకులు కూడా ఈ విధమైన కంటెంట్‌కు ఆసక్తి చూపడం వల్ల ఆ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇలా హీరోయిన్లు కూడా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా బోల్డ్ పాత్రలు పోషించడానికి ముందుకు వస్తున్నారు. కానీ దీని వలన సినిమా ఇండస్ట్రీ పరువు తగ్గుతోందా? లేక నటీమణులు తమ ప్రతిభతో, ధైర్యంతో ముందుకు వస్తున్నారా అనే అయోమయం చాలా మందిలో ఉంది.



ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఎలాంటి బోల్డ్ సీన్స్ లేకుండానే సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చారు. క్లాసిక్ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అందరికీ గుర్తుండిపోయేలా నిలిచాయి. కానీ ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే రొమాన్స్, గ్లామర్, బోల్డ్ కంటెంట్ తప్పనిసరి అన్న భావన ఏర్పడింది. దర్శకులు కూడా ఈ ట్రెండ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌లను రాస్తున్నారు. ఈ పరిస్థితికి అసలు కారణం ఎవరిది? దర్శకులదా? లేక ప్రేక్షకులదా? దర్శకులు బోల్డ్ సీన్స్‌తో సినిమా రంజుగా ఉంటుందని నమ్ముతూ వాటిని జోడిస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు. ఈ రెండింటి ప్రభావం వలన ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ బలపడింది.



సినీ విశ్లేషకులు చెబుతున్నట్లుగా, ఇది ఆగాలంటే ప్రేక్షకుల అభిరుచిలోనే మార్పు రావాలి. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే కాదు, శ్రద్ధగా తీసిన కథా చిత్రాలు, విలువలు కలిగిన సినిమాలకు కూడా సమాన ఆదరణ ఇవ్వాలి. అప్పుడే దర్శకులు కూడా ఈ మార్పును గమనించి సక్రమమైన సినిమాలు తీయడానికి ప్రోత్సహం పొందుతారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కంటెంట్ కోసం కాకుండా వారి నటనను గుర్తించే స్థితి రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: