తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఈమధ్య దేశ దేశాలను దాటేస్తోంది. ఎన్నో అవార్డులు తెలుగు సినిమాలను అందుకునేలా చేస్తున్నాయి. rrr సినిమాలోని పాటకి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేదికను దుబాయిలో చాలా గ్రాండ్గా చేశారు. మొదటిరోజు తెలుగు ,కన్నడ సినిమాలలో 2024 లో విడుదలైన చిత్రాలలో ప్రతిభ కనపరిచిన నటీనటులకు ఈ అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రంగా కల్కి సినిమా నిలువగా, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్ నిలిచారు.


తెలుగు సినిమాలకు ఎన్ని అవార్డులు వచ్చాయనే విషయానికి వస్తే..


ఉత్తమ చిత్రంగా కల్కి 2898AD.

ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ -పుష్ప 2.

ఉత్తమ నటిగా రష్మిక (పుష్ప 2)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) హనుమాన్ సినిమా (తేజ సజ్జా)

ఉత్తమ సహాయ నటుడుగా -కల్కి2898AD మూవీ (అమితాబచ్చన్)


ఉత్తమ సహాయ నటిగా-కల్కి 2898AD (అన్నా బెన్)

ఉత్తమ హాస్యనటుడుగా - మత్తు వదలరా 2(సత్య)

ఉత్తమ విలన్ -కల్కి (కమలహాసన్)

ఉత్తమ పరిచయ నటి -మిస్టర్ బచ్చన్ (భాగ్యశ్రీ బోర్సే )


ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్ (పుష్ప 2)

ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ పరిచయ నటుడు -కమిటీ కుర్రోళ్ళు (సందీప్ సరోజ్)

ఉత్తమ డైరెక్టర్ (క్రిటిక్స్)- ప్రశాంత్ వర్మ (హనుమాన్)

ఉత్తమ పరిచయ డైరెక్టర్ -35 చిన్న కథ (నందకిషోర్ యేమని)

ఉత్తమ సంగీత దర్శకుడిగా - పుష్ప 2 (దేవిశ్రీప్రసాద్)

ఉత్తమ గాయకుడు -పుష్ప 2(శంకర్ బాబు కందూరి)

ఉత్తమ గీత రచయిత -దేవర (రామ్ జోగయ్య శాస్త్రి)

ఉత్తమ గాయని -దేవర (శిల్పా రావు)

ఉత్తమ కొత్త నిర్మాత- కమిటీ కుర్రోళ్ళు (నిహారిక కొణిదెల)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ -దేవర (రత్న వేలు)


ఫ్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా- అశ్వినీ దత్ (వైజయంతి మూవీస్)

తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన అవార్డులు ఇవే..

మరింత సమాచారం తెలుసుకోండి: