
బుక్ మై షో ప్లాట్‌ఫామ్ ప్రకారం ఇప్పటికే 100K+ ప్రేక్షకులు ఆసక్తి చూపించడంతో మిరాయ్ సినిమాపై క్రియేట్ అయిన బజ్‌కు నిదర్శనం అని చెప్పాలి. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ రాకింగ్ స్టార్ మంచు మనోజ్. చాలా కాలం తర్వాత ఓ విలన్ పాత్రలో ఆయన తెరపై కనిపించబోతున్నారు. మనోజ్ ఎనర్జీతో కూడిన స్క్రీన్ ప్రెజెన్స్, తేజ సజ్జాతో ఆయన కాంపిటీషన్ ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ కానుంది. హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, ఈ జంటపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. సినిమాకు టాక్ బాగుంటే మరో హనుమాన్ పక్కా అని చెప్పాలి.
మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో గౌర హరి తన సరికొత్త ట్యూన్స్‌తో సినిమాకు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టాడు. భారీ స్థాయిలో సినిమాలను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. మొత్తానికి, అన్ని విభాగాల్లోనూ అంచనాలను పెంచుతున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తేజ సజ్జా సూపర్ హీరో అవతారంతో, మంచు మనోజ్ విలన్ పవర్‌తో, అద్భుతమైన టెక్నికల్ వర్క్‌తో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనడంలో సందేహం లేదు.