సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA -2025) అవార్డుల వేడుకలు దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించిగా ఈ వేడుకలకు చాలామంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యి సందడి చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా ఎంతమంది సిని సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా హాజరయ్యింది. విభిన్నంగా రెడ్ కలర్ దుస్తులను ధరించి, అందంగా ముస్తాబైన మంచు లక్ష్మి రెడ్ కార్పెట్ పైన ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.


అక్కడ ఎంతో ఓపికగా అభిమానులు అడిగిన ఫోటోలకు సెల్ఫీలు ఇచ్చిన మంచు లక్ష్మి .. ఆ సమయంలో కొంతమంది చాలా అతిగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి వీడియోలో కూడా మంచు లక్ష్మిని ఆటపట్టిస్తూ ట్రోల్ చేశారు. కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో అప్పటివరకు ఓపికగా ఉన్న మంచు లక్ష్మి ఒక్కసారిగా కోపంతో కట్టలు తెంచుకొని "ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి రాస్కెల్స్ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యింది"  సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వెంటనే మళ్ళీ అభిమానుల కోసం సెల్ఫీలు ఫోటోలు ఇచ్చింది మంచు లక్ష్మి.



మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే..సుమారుగా ఐదేళ్ల తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న దక్ష అనే సినిమాతో మళ్ళీ వెండితెర పైన కనిపించబోతోంది. మోహన్ బాబు ప్రొడక్షన్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో దక్ష సినిమాని తెరకెక్కించారు. ఇందులో సముద్రఖని, చైత్ర శుక్ల, సిద్ధిక్, మోహన్ బాబు తదితర నటీనటులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో మంచు లక్ష్మి గట్టెక్కితే కచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించే అవకాశం ఉంటుంది. ఇందులో మంచు లక్ష్మి పోలీస్ అధికారిగా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: