ఇప్పటి జనరేషన్లో సోషల్ మీడియా లేకుండా బతకడం లేదు. ముఖ్యంగా ఉదయం లేస్తే చాలు వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ అందులోనే లీనమైపోతున్నారు. కానీ అలాంటిది నేపాల్ దేశంలో ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్,స్నాప్ చాట్, వాట్సప్ వంటి యాప్స్ ని బ్యాన్ చేయడంతో నేపాల్ దేశంలో సంక్షోభం ఏర్పడింది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ నిరసన గందరగోళంగా మారి చాలామంది యువత చనిపోయారు. ఎంతో మందికి గాయాలయ్యాయి. ఇప్పటికే 19 మందికి పైగా చనిపోగా 250 మందికి పైగా గాయాలయ్యాయి.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా హ్యాండిల్ పై నిషేధమని చాలామంది అనుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్,స్నాప్ చాట్ ,ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ప్రభుత్వం నిషేధించింది. 

దాంతో చాలామంది రోడ్లపై ఎక్కి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ అధికారులను సైతం లెక్కచేయకుండా నిరసన తెలియజేస్తున్నారు.  వారిని ఆపలేని పోలీసులు  కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో చాలామంది యువత అక్కడికక్కడే మరణించారు. కట్ చేస్తే..ఈ మారణ హోమానికి కారకులు ఎవరు అసలు విషయం ఏంటో చూద్దాం.. సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం వల్లే ఇలా చేస్తున్నారని చాలామంది అనుకుంటారు.. కానీ అసలు కారణం ప్రభుత్వం చేస్తున్న పనులే..గత కొంతకాలంగా నేపాల్ ఆర్థికంగా చితికి పోతుంది.   ఇదిలా నడుస్తున్న సమయంలో కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు విలాసాలకు పోతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు.  

అలాగే 2015లో ప్రభుత్వ రంగ సంస్థ నేపాల్  ఎయిర్ వేస్ రెండు విమానాల్ని కొనుగోలు చేసే టైంలో పెద్ద ఎత్తున అవినీతి చేసింది. మరో ముఖ్యమైన అంశం నేపాల్ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని విస్మరించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత రావడంతో , దానికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది చూసి తట్టుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించింది. పెద్ద ఎత్తున బయటకు వచ్చి రోడ్ల పైన నిరసన చేస్తున్నారు.  మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం నేపాల్ లో ఎమర్జెన్సీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: