
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల ప్రాంతంలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేస్తున్న సమయంలో రెండు వర్గాల మధ్య కూడా ఒక ఘర్షణ చోటు చేసుకుంది.. పరిటాల గ్రామానికి చెందిన బాల గణేష్ ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ సమక్షంలోనే సుమారుగా 11 రోజులపాటు వినాయకుడికి విగ్రహ పూజలు చేశారు. అయితే శనివారం రోజున నిమజ్జనానికి భారీ ఏర్పాట్లతో ఊరంతా ఊరేగింపుతో చేస్తున్న సమయంలో ఆ గ్రామంలో ఒక చర్చి సమీపంలో వినాయక విగ్రహం చేరుకుంది. ఆ శోభయాత్రలో పెట్టిన పాటలు అక్కడ స్థానికంగా (క్రిస్టియన్స్) అభ్యంతరం తెలిపారు.
దీంతో ఇరువురి వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. అంతేకాకుండా తోపులాట మధ్యలో కూడా రాళ్ల దాడి జరగడంతో ఈ రాళ్లదాడిలో ఉత్సవ కమిటీ వర్గానికి చెందిన రాహుల్, గొల్లపల్లి కిషోర్ కి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన భాజపా శ్రేణులు కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని మరి రహదారి పైన గ్రామ ప్రజలతో ఆందోళన చేపట్టారు. 24 గంటలలో న్యాయం చేయాలని గతంలో కూడా వారు ఎన్నోసార్లు దాడులు చేశారంటూ రహదారి పైన బైఠాయించారు.
రాళ్ల దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసిన వారిని అరెస్ట్ చేయలేదు.. అయితే అందులో A1గా ఉన్నవారిని చూశామని అందుకే ఆలస్యం అవుతుందంటూ అధికారులు తెలియజేస్తున్నారు. రాళ్ల దాడి చేసినా కూడా నిన్నటి రోజు నుంచి హిందువులకు సంబంధించి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా కొత్త వీడియోలు చిత్రీకరించి తీవ్రంగా అవమానిస్తున్నారని హిందువులు ఏం చేసుకోలేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. అక్కడ స్థానికులతో పాటు భాజపా నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. దీంతో సుమారుగా 200 మంది హిందువులు కూడా రహదారి పైన బైఠాయించారు. నిందితులను అరెస్టు చేయాల్సిందే అంటూ హిందువులు కూడా తిరగబడ్డారు."జైశ్రీరామ్" అనే నినాదాలతో రోడ్డును బైఠాయించారు. అధికారులు కూడా ఈ దాడికి పాల్పడిన వారిపై 24 గంటలలో చర్యలు తీసుకుంటామని( సిఐ. డి చవాన్ , ఎస్సై విశ్వనాథ్ ) రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో హిందువుల సైతం శాంతించారు.