తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే తరుణంలో రాజకీయ పార్టీల మధ్య కాస్త గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని శతవిధాల  ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏఐఏడీఎంకే పార్టీ కూడా  ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ ఇలా నడుస్తున్న సమయంలోనే  తలపతి విజయ్ స్థాపించినటువంటి పార్టీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. టీవీకే పార్టీ పేరుతో ఆయన స్థాపించిన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు తలపతి విజయ్ కూడా మొదటిసారి పార్టీ స్థాపించారు కాబట్టి మొదటిసారి సీఎం సీటును అధిరోహించాలని మంచి మంచి ప్లాన్లు వేస్తున్నారు.  ఆయన వేసిన ఆ ఒక్క ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. ఆ వివరాలు చూద్దాం.. 

తమిళనాడు లో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో విభేదాలు వచ్చి కొంతమంది  బయటకు రావాలని ప్రయత్నాలు చేసినా కూడా స్టాలిన్ వారిని ఆపడంలో సక్సెస్ అవుతున్నారు. అంతేకాకుండా ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రులు  పళనిస్వామి మీద కోపంతో రాజీనామాలు చేసి  పార్టీని బహిష్కరించారు. అలాగే టీటీవి దినకరన్, పన్నీరు సెల్వం ఓపిఎస్ పార్టీ నుంచి కూడా విజయ్ వైపు వెళ్తున్నారు. ఏఐఏడిఎంకె నుంచి ఇప్పటికే శశికళ కూడా విభేదించింది. కానీ విజయ్ వైపు వెళుతుందా లేదా అనేది తెలయడం లేదు. కట్ చేస్తే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొండి పట్టుదలతో ఎలాగైనా సీఎం కావాలని అనేక ప్లాన్ లు గీస్తున్నారు.  ఒకప్పుడు రజినీకాంత్ ఫ్యాన్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని వేలాది రిజిస్ట్రేషన్స్ ఉండేవి. మొత్తం 65 వేల సంఘాలు ఉండేవి.

విజయ్ కూడా అదే విధంగా ఎక్కడెక్కడ  రజినీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారో, అదే ఊర్లలో  విజయ్ ఫ్యాన్స్ పేరుతో అసోసియేషన్స్ రిజిస్ట్రేషన్ చేయించాడు. తన సొంత ఖర్చులతో ఈ రిజిస్ట్రేషన్లు చేయించేశాడు. ఈ విధంగా 68 వేల రిజిస్ట్రేషన్స్ చేయించాడు.. అయితే ఇప్పటివరకు అవి 85 వేలకు చేరినాయని తెలుస్తోంది. ఒక్కొక్క సంఘంలో 25 మంది నుంచి ఎక్కువ మంది సభ్యులే ఉంటారు. వాళ్లందరినీ తన పార్టీకి సంబంధించి బూత్ కమిటీలుగా నియమించుకొని తన పార్టీ గ్రామస్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఎలాగైనా మొదటిసారి తాను సీఎం సీటు అధిరోహించాలని గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం విజయ్ కి తమిళనాడు రాజకీయాల్లో తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: