
ఆసియా కప్ లో మొత్తం 8 టీం లు పాల్గొనబోతున్నాయి. అందులో నాలుగు టీమ్లను ఒక గ్రూప్ గా , మరో నాలుగు టీమలను మరో గ్రూప్ గా విభజిస్తారు. దానితో ఏ గ్రూప్ నాలుగు టీమ్ లు బి గ్రూప్ లో మరో నాలుగు టీం లు ఉంటాయి. గ్రూప్ ఏ లో భారత్ , పాకిస్తాన్ , ఒమన్ , uae జట్లు ఉండనుండగా ... గ్రూప్ బీ లో శ్రీలంక , బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ , హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ఇక ఏ గ్రూపు లోని జట్లు మిగిలిన మూడు జట్లతో మ్యాచులు ఆడతాయి. అలా మ్యాచ్లలో ఆడిన తర్వాత ప్రతి గ్రూపులో లిస్టులో టాప్ లో ఉన్న రెండు జట్లు సెమిస్ కి చేరుతాయి. ఆ తర్వాత తలపడిన నాలుగు జాట్లలో టాప్ లిస్టులో ఉన్న రెండు జట్లు ఫైనల్ కు చేరుతాయి. ఫైనల్ కు చేరిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 28 వ తేదీన దుబాయిలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ఆసియా కప్ విజేతగా నిలుస్తారు. ఇకపోతే ఇండియా జట్టు లీక్స్ లో భాగంగా భారత్ vs పాకిస్తాన్ , భారత్ vs ఒమన్ , భారత్ vs యూఏఈ జట్లతో తలపడనుంది.