
ప్రస్తుతం క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీనికి చికిత్స కోసం ఇప్పటికే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని పద్ధతులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే, ఇప్పుడు కేవలం ఒకే ఒక ఇంజెక్షన్ తో క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ రకానికి చెందిన 2141.వి11 అనే మందుపై పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్ విస్తరించిన 12 మందిపై శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఆరుగురిలో కణితులు కుంచించుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇద్దరిలో రక్త, రొమ్ము క్యాన్సర్లు పూర్తి స్థాయిలో నయమైనట్లు సమాచారం.
ఈ పరిశోధనలో సైంటిస్టులు మందును ఒక కణితిలో జొప్పించారు. ఆశ్చర్యకరంగా, ఆ కణితి మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లోని కణితుల సైజులు కూడా తగ్గుతున్నాయని వారు గుర్తించారు. ఈ ప్రయోగాలు మంచి ఫలితాలను ఇస్తుండటంతో, సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. ఈ మందు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ ఈ పరిశోధనలు విజయవంతమై, ఈ మందు ప్రజలకు అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ రోగులకు ఒక కొత్త ఆశ లభించినట్టే. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం దేశంలో వేల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ వ్యాధి వల్ల మృతి చెందుతున్న సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు