
షాకింగ్ విషయం ఏమిటంటే, ఆమెకు పరిచయం కూడా లేని ఓ ప్రముఖ తెలుగు నిర్మాత ఈ క్లిష్ట సమయంలో ముందుకు వచ్చి సహాయం అందించారు. ఆ నిర్మాత మరెవరో కాదు, పలు హిట్ సినిమాలను నిర్మించి పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న SKN. రేఖా బోజ్ తనకు ఎలాంటి అభ్యర్థన చేయకపోయినా, సోషల్ మీడియాలో చూసిన వెంటనే మానవతా దృక్పథంతో సహాయం చేయాలని నిర్ణయించుకోవడం ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది. రేఖా బోజ్ ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో రివీల్ చేస్తూ SKN కి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ విషయం బయటకు వచ్చాక సినీ సర్కిల్స్‌లో SKN గురించి ప్రశంసల వర్షం కురుస్తోంది. సాధారణంగా చాలా మంది సహాయం చేసినా పెద్దగా ప్రచారం కోరుకుంటారు. కానీ SKN మాత్రం ఈ సాయం ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన మంచి మనసు అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. సినిమా రంగంలో విజయాలు సాధించడంతో పాటు ఇలాంటి సందర్భాల్లో సహాయం చేయడం ద్వారా SKN ఒక నిర్మాతగానే కాకుండా మానవతావాది అని నిరూపించుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు