టాలీవుడ్ లో వరుసగా సినిమాలతో సక్సెస్ అవుతూ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న మీరాయ్ చిత్రంలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న చాలా గ్రాండ్గా చాలా భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా భారీగా రెస్పాన్స్ రావడంతో ఏకంగా చిత్ర బృందమే డైరెక్టుగా ఈ సినిమాని కొన్నిచోట్ల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే టికెట్ల ధర విషయంపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిన్నటి రోజున నిర్వహించారు.



ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జా మాట్లాడుతూ.. సినిమా కోసం చాలా కష్టపడ్డాము.. ఈ సినిమాను అందరికీ చూపించాలని ఉద్దేశంతోనే చిత్ర బృందంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నామని.. ఆ విషయాన్ని తాను ఈవెంట్లో చెబుతున్నానని.. మా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి మరి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాం.. మా సినిమా టికెట్ల రేట్లు పెంచలేదు.. సాధారణ ధరలకే టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చాము అందరూ సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామంటూ తెలిపారు.


ఇది చాలా రిస్క్ తో కూడిన పని అని తెలుసు కానీ మీ కోసం, మా సినిమా కోసమే ఇలా చేస్తున్నామంటూ తేజ సజ్జా తెలియజేశారు. అలాగే యూఎస్ఏ లో కూడా టికెట్ ఓపెనింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయని తెలియజేశారు. హీరో తేజ సజ్జా చేస్తున్న పనిని మిగిలిన హీరోలు కూడా చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు. సినిమా టికెట్లు అధికంగా ఉండడం వల్లే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు ప్రేక్షకులు. మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించాగ,రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: