సినిమా ఇండస్ట్రీ లో అందం , హిట్స్ రెండు ఉన్న వారికి మంచి అవకాశాలు దక్కుతాయి అని , వారు చాలా తక్కువ కాలం లోనే ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుతారు అని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో అది రాంగ్ అని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ ముద్దు గుమ్మ అద్భుతమైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే తాను నటించిన సినిమాలలో ఒక సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకుంది. కానీ ఆమెకు ప్రస్తుతం ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి ఐశ్వర్య మీనన్. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరో గా రూపొందిన స్పై అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఇందులో ఐశ్వర్య మీనన్ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. 

మూవీ తర్వాత ఈమె కార్తికేయ హీరో గా రూపొందిన భజే వాయు వేగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఇప్పటివరకు ఈమె నటించిన రెండు సినిమాలలో ఒక సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. రెండు సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ ఈ బ్యూటీ కి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: