సినిమాల్లో హీరోయిన్ గా నటించి వారు వెండి తెరపై నవ్వుతూ ప్రేక్షకులను నవ్వించే వారు కూడా ఉంటారు. అలా నవ్వించే వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఉన్నాయో మనకు తెలియదు. సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగి ఎంతో మంది గొప్ప గొప్ప నటులతో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఓ నటి జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు ఉన్నాయి. మరి సినిమా పరిశ్రమలో స్టార్ బ్యూటీ గా కెరియర్ను కొనసాగించి నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన వారిలో బాలీవుడ్ నటిమని లీనా చందావర్కర్ ఒకరు. ఈమె కర్ణాటకలోని ధార్వాడ్‌లో 1950 లో జన్మించారు.

ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఆ సమయంలో కెరీర్ను కొనసాగించిన చాలా మంది నటులతో నటించి ఎన్నో విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 1970 నుండి 1980 ల మధ్య కాలంలో ఈమె ఎన్నో విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే ఈమె అద్భుతమైన స్థాయిలో నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే గోవా మొదటి ముఖ్యమంత్రి కుమారుడు సిద్ధార్థ్ బందోద్కర్‌ను వివాహం చేసుకున్నారు.

కానీ ఈ వివాహం ఆమెకు ఆనందాన్ని ఎక్కువ కాలం మిగిల్చలేదు. పెళ్లయిన ఆరు నెలలకే లీనా భర్త ఓ ప్రమాదంలో చనిపోయారు. అప్పటికే గర్భవతిగా ఉన్న లీనా తన భర్త మరణం బాధ నుండి బయట పడడానికి చాలా సమయం పట్టింది. లీనా బాధలో ఉన్న సమయంలో ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత 1980 లో లీనా , కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి సుమిత్ అనే కుమారుడు కూడా జన్మించాడు. వీరి వివాహం జరిగిన ఏడు సంవత్సరాలకు అనగా 1987 వ సంవత్సరం కిషోర్ కుమార్ కూడా మరణించాడు. ఇలా వెండి తెరపై సక్సెస్ ఫుల్ నటిగా కెరియర్ను కొనసాగించిన లీనా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను , భాగాలను ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: