నేపాల్ దేశంలో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి రోడ్లపై ప్రజలు వచ్చి ప్రధాని ఇతర నాయకుల ఇండ్లపై దాడులు చేసి వారిని తీవ్రంగా కొట్టారు. వారి భవనాలను కూడా తగలబెట్టారు.. ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ, ఆగకుండా దాడులు నిర్వహించారు. ఇన్ని రోజులు వారు ఎవరినైతే రాజులుగా భావించారో వారినే దేశం దాటేలా తరిమికొట్టారు. చివరికి కొంతమంది రాజకీయ నాయకుల భార్యలు కూడా వారు నిర్వహించిన దహన కాండలో మాడి మసైపోయారు.. ఇక ఇదే కాకుండా  ఆ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తీవ్రంగా కోపోద్రిక్తులై షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఆమెను దేశం దాటిపోయేలా  చేశారు. 

ఆమె కూడా అక్కడి ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి చేసి, పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాసింది. ముఖ్యంగా రిజర్వేషన్ల వల్ల ప్రజలు తిరుగుబాటు చేసి ఆమెను  దేశం దాటించారు.. ఈ విధంగా దేశంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం పాలకులే. ఇదే విషయంపై తాజాగా రవి ప్రకాష్ వేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది నాయకులకు అధికారాన్ని కట్టబెడితే వారు ఆస్తులను పెంచుకొని, వారి కుటుంబాలకు వ్యాపారాలు పెంచి దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని అంటున్నారు. దేశాన్ని దోచుకోవడం, ఆస్తులను పంచుకోవడం తప్ప అభివృద్ధి చేసేది లేదని తెలియజేశారు.

 ఇదే తరుణంలో ఇండియాలో కూడా ఆ విధమైన పరిస్థితులు త్వరలో వస్తాయని ఒక మహిళ నేత మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. మన దేశం కూడా ఈ విధంగా కాబోతుంది అనడానికి ఆ రెండు దేశాలే ఉదాహరణ అని ఆయన ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.. ఏది ఏమైనప్పటికీ  మన ఇండియాలో కూడా అవినీతి, మీడియాపై  అణచివేత పెరుగుతోంది. ఇదే తరుణంలో రాబోవు రోజుల్లో దేశ ప్రజలు కూడా  నాయకులపై తిరుగుబాటు  చేస్తారని రవి ప్రకాష్ చెప్పకనే చెప్పారు. అలా నాడు బంగ్లా నేడు నేపాల్ త్వరలో ఇండియాలో కూడా జరగబోతుందని పరోక్షంగా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: