
‘అర్జున్ రెడ్డి’లో సాహజంగా తెరకెక్కించిన లిప్ లాక్ సీన్లు చూసి చాలామంది విమర్శలు చేశారు. కానీ ఎంతమంది విమర్శించారో, అంతకంటే ఎక్కువమంది ఆ సీన్లలోని నిజమైన భావోద్వేగాన్ని అర్థం చేసుకుని ప్రశంసించారు. అటువంటి రియలిస్టిక్ మరియు బోల్డ్ ప్రదర్శనలు తెరపైకి తీసుకురావడంలో సందీప్ రెడ్డి వంగా ప్రతిభకు అంతులేదని అప్పుడే నిరూపితమైంది. ఇక ‘అనిమల్’ సినిమాతో ఆయన మరోసారి తన క్లాస్ వర్క్‌ను చూపించారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న రణబీర్ కపూర్‌ను పూర్తిగా కొత్తగా చూపించి, రష్మిక మందన్నాతో ఉన్న భావోద్వేగ సన్నివేశాలను ప్రేక్షకుల మదిలో చెరగని విధంగా ముద్రవేశారు. రణబీర్ కపూర్ వంటి స్టార్ నటుడిని ఈ స్థాయిలో తీర్చిదిద్దడం ఆయనకే సాధ్యం అని అందరూ చెప్పుకున్నారు.
ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం ‘స్పిరిట్’ అనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై ఉంది. ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా తలపెట్టిన ప్లాన్లు వేరే లెవల్‌లో ఉన్నాయి. ఒక్కో పాత్ర కోసం వేరువేరు భాషల ఇండస్ట్రీల నుంచి నటీనటులను ఎంపిక చేయడమే కాకుండా, ప్రతి సన్నివేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో కనిపించే మరదలు పాత్ర కోసం ఒక ప్రముఖ తెలుగు యాంకర్‌ను ఎంపిక చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ యాంకర్ ఎవరో కాదు, అందాల ముద్దుగుమ్మ, టాలీవుడ్ లౌడ్ స్పీకర్‌గా పేరుగాంచిన "శ్రీముఖి".
శ్రీముఖి టెలివిజన్ రంగంలో ఎలాంటి స్థాయి సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అద్భుతమైన హోస్టింగ్ స్కిల్స్, చురుకైన వ్యక్తిత్వం, తనదైన హాస్యంతో ఆమె టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. టీవీతో పాటు ఆమె కొన్ని సినిమాలలో కూడా నటించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ప్రభాస్ చెల్లెలి పాత్ర చేయమని వచ్చిన ఆఫర్‌ను శ్రీముఖి తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మరదలు పాత్రలో కనిపించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే, ఈ అవకాశం ఎంత పెద్దదో అర్థం అవుతుంది. అభిమానుల మాటల్లో ఇది శ్రీముఖి కెరీర్‌లో ఓ వెరీ లక్కీ ఛాన్స్. ఎందుకంటే శ్రీముఖి ప్రభాస్‌కు డైహార్డ్ ఫ్యాన్. ప్రభాస్ నటించే సినిమాలో అవకాశం వస్తే ఆమె ఎందుకు తిరస్కరిస్తుంది? అందుకే వెంటనే కాల్ షీట్లు ఇచ్చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.