యంగ్ హీరో తేజ సజ్జ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ విజ‌యంతో వ‌చ్చిన జోష్‌తో తేజ న‌టించిన తాజా సినిమా ‘మిరాయ్’ ఈ వారాంతంలో భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండ‌డంతో మేక‌ర్స్ ఓన్ రిలీజ్‌కు వెల్లిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. . అడ్వాన్స్ బేస్ మీద ఇతర డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్‌లు గట్టిగానే రాబట్టినా, ఒకవేళ సినిమా ఆశించిన రేంజ్‌కు చేరుకోకపోతే కొంతవరకు రిఫండ్ చేసే అవకాశం ఉంది.


‘హనుమాన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జ మరోసారి మంచి బిజినెస్ సాధించి, మీడియం రేంజ్ హీరోల స్థాయిలో తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. తెలుగు వెర్షన్‌తో పాటు ఇతర డబ్ వెర్షన్‌లు కూడా మేజర్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విడుదల అవుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.


నైజాం - రు. 10 కోట్లు

సీడెడ్ - రు. 5 కోట్లు

ఆంధ్రా - రు. 12 కోట్లు
--------------------------------
ఏపీ + తెలంగాణ = రు. 27 కోట్లు

కర్ణాటక + ఆర్వోఐ + డబ్ – రు. 5 కోట్లు

ఓవర్సీస్ – రు. 4.5 కోట్లు


వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ – రు. 36.50 కోట్లు
బ్రేక్ ఈవెన్ – రు. 37.50 కోట్ల షేర్


అంటే సినిమా వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల షేర్ దాటిన వెంటనే మేకర్స్‌కు లాభాలు మొదలవుతాయి. మొత్తం మీద 37.5 కోట్ల షేర్ మార్క్‌ చేరితే డిస్ట్రిబ్యూటర్లు సహా అందరికీ లాభాలు ఖాయం. ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం, తేజ సజ్జపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడం ఈ సినిమా బాక్సాఫీస్ రన్‌కి పెద్ద బూస్ట్ కానుంది. ‘మిరాయ్’ తేజ సజ్జకు మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: