టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి శెట్టి తక్కువ కాలంలోనే తన అందం, అభినయం, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్‌తో కెరీర్‌ను మొదలుపెట్టి, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి ఒక క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ రెండు సినిమాలు ఆమెకు స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టినప్పటికీ, తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలబడలేదు. వరుస వైఫల్యాలు కృతిశెట్టీ కెరీర్‌పై బరువైన ప్రభావం చూపించాయి.ఈ పరిస్థితుల్లో ఆమె కొంతకాలం పాటు తెలుగు సినిమాలకు సైన్ చేయడం కూడా ఆపేసింది. తాను ఎంపిక చేసుకున్న ప్రతి స్క్రిప్ట్ ఒకదాని తర్వాత మరొకటి నిరాశ పరచడంతో, ప్రేక్షకుల మైండ్‌లో కూడా కృతి పట్ల ఆసక్తి కొంత తగ్గింది. ఈ సమయంలో సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో కృతి గురించి హ్యూజ్ ట్రోలింగ్ కూడా మొదలైంది. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడాలని కృతిశెట్టి నిర్ణయించుకుంది.


తాజాగా ఆమె ఒక కొలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగమై అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇందులో ఆమె హీరోయిన్ పాత్రలో కాకుండా ఒక క్రూషియల్ సపోర్టింగ్ క్యారెక్టర్‌లో నటించబోతోందని సమాచారం. ఇది చాలా అరుదుగా హీరోయిన్స్ ఎంచుకునే నిర్ణయం. పెద్ద హీరోయిన్స్ సాధారణంగా లీడ్ రోల్స్‌కే పరిమితం అవుతుంటారు. కానీ కృతి మాత్రం తన కెరీర్‌ను మళ్లీ రీబూట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రిస్క్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.



సినిమా కథలో కీలక మలుపులు తిప్పే పాత్ర ఇది . ఈ పాత్ర ద్వారా కృతి తన నటనను కొత్త కోణంలో ప్రదర్శించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సురక్షితంగా ఉండటం కోసం చాలా మంది హీరోయిన్స్ కూడా సాంప్రదాయికమైన రోల్స్‌నే ఎంచుకుంటారు. కానీ కృతి శెట్టి మాత్రం ఈసారి తన ఇమేజ్‌ను పక్కన పెట్టి, సవాలు చేసే పాత్రతో ముందుకు రావడం సినీ విశ్లేషకులను కూడా ఆకట్టుకుంది. ఆమె ఈ నిర్ణయంతో స్పష్టంగా చెప్పకనే చెబుతోంది. స్టార్‌డమ్ కన్నా తనకు నటనపైనే నమ్మకం ఎక్కువ అని. ఈ రిస్క్ సక్సెస్ అయితే కృతిశెట్టి కెరీర్ మళ్లీ శిఖరాలకు చేరుకోవడం ఖాయం అంటున్నారు సినీ విమర్శకులు. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే, కృతిశెట్టి తన గత వైఫల్యాలను వెనక్కి నెట్టి, మళ్లీ టాప్ హీరోయిన్స్ లిస్టులో నిలబడుతుందని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.



ఇన్నాళ్లకి కృతి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా "స్టాండింగ్ ఓవేషన్"‌ ఇవ్వాల్సిందే అభిమానులు అంటున్నారు. చాలా కాలం నుండి సరైన దారిలో లేని ఆమె కెరీర్‌కు ఇది ఒక కొత్త ఆరంభమవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతటా నెలకొంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. "ఇలాంటివి ముందే చేసి ఉంటే ఈపాటికి సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఉండేది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, ఈ చిత్రంతో కృతి శెట్టి తన నటన శక్తిని నిరూపించుకుంటుందా, కెరీర్‌ను మళ్లీ మలుపు తిప్పుకుంటుందా..? అనేది చూడాలి. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కృతిశెట్టి భవిష్యత్తు గమనానికి ఈ ఒక్క నిర్ణయం గేమ్‌చేంజర్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: