సింగర్..నటుడు..అయినటువంటి నోయల్ సీన్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన కొన్ని ర్యాప్ సాంగ్స్ పాడిన సంగతి మనకు తెలిసిందే.అయితే అలాంటి సింగర్ నోయల్ నటి ఎస్తేర్ నోరోన్హాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే ప్రేమించుకున్న ఈ జంట పెళ్లయ్యాక కనీసం నెలరోజులు కూడా కలిసి లేరట. పెళ్ళైన 6 నెలల సమయంలో వీరు 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నట్టు నోయల్ ఎస్తేర్ లు వాళ్లు పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే అలాంటి ఈ జంట పెళ్లయిన సంవత్సరంలోపై విడాకులు తీసుకున్నారు.ఇక విడాకుల తర్వాత నోయల్,ఎస్తేర్ ఇద్దరు ఎవరి వెర్షన్ లో వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో చెప్పుకొచ్చారు. 

అయితే తాజాగా ఎస్తేర్ నోరోన్హా గురించి ఓ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోందట. అయితే రెండో పెళ్లి అని ఎక్కడా మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆమె పెట్టిన పోస్ట్ చాలామందిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా గుడ్ న్యూస్ అంటూ ఎస్తేర్ నోరోన్హా పెళ్లికి సంబంధించే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఎస్తేర్ పెట్టిన ఆ పోస్టులో ఏముందంటే.. నా లైఫ్ లో మరో అందమైన సంవత్సరం, అవకాశాలు, అద్భుతాలను అందించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నా బర్త్ డే రోజు మీ ప్రేమ అభిమానాన్ని నామీద కురిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

మీతో ఒక ప్రత్యేక ప్రకటన పంచుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే వస్తుంది వేచి ఉండండి అని పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎస్తేర్ తన రెండో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అందుకే అలాంటి పోస్ట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఎస్తేర్ నోరోన్హా చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో వేచి చూడాలి.ఇక ఈ హీరోయిన్ 1000 అబద్దాలు,భీమవరం బుల్లోడు,జయ జానకి నాయకి వంటి సినిమాల్లో చేసింది.అలాగే 69 సంస్కార్ కాలనీ అనే సినిమాలో బోల్డ్ పాత్రలో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: