కొబ్బరి నీళ్లు, తేనె రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిటినీ కలిపి తాగడం వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. వేసవిలో శరీరానికి చలువనిచ్చే పానీయాల్లో ఇది ఒకటి. తేనె కలిపిన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటితోపాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

తేనెలో ఉండే గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కనుక వీటిని కలిపి తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత ఈ పానీయాన్ని తాగితే కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

 కొబ్బరి నీళ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది. తేనెలో ఉన్న సహజసిద్ధమైన చక్కెరలు కృత్రిమ చక్కెరల కన్నా ఆరోగ్యకరమైనవి. ఈ రెండిటినీ కలిపి తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనె కూడా రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: