
జాన్వి కపూర్ బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసినా, పెద్ద సక్సెస్ మాత్రం అంతగా అందుకోలేకపోయింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా “దేవర” సినిమా ద్వారా అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డా, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. కానీ, తనపై నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. “పెద్ది సినిమా”తో ఇండస్ట్రీలో తన స్థానం పక్కాగా స్థిరం చేసుకోవాలని జాన్వి కపూర్ ఆశలు పెట్టుకుంది. అందుకోసం ఆమె చాలా కష్టపడుతూ, తన ప్రతిభను నిరూపించుకోవడానికి అన్ని విధాలా ట్రై చేస్తోంది. అయితే, ఆ సినిమాకి ముందు సోషల్ మీడియాలో జాన్వి పేరు పెద్ద ఎత్తున హైలైట్ అవుతోంది.
కారణం – ఆమె ఇటీవల చేసిన మంచి పని. జాన్వి కపూర్ చిన్ననాటి నుంచి తమ ఇంట్లో పని చేస్తున్న ఒక పనిమనిషి కూతురి చదువుల బాధ్యత తీసుకుని, ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం సహాయం చేస్తోందట. ఒకట్రెండు రోజులు కాదు, చిన్ననాటి నుంచి జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి ఆ కుటుంబాన్ని బాగా చూసుకుంది. ఇప్పుడు అదే బాధ్యతను జాన్వి తన భుజాలపై వేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో బయటకొచ్చిన తర్వాత నెటిజన్లు జాన్వి కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “అమ్మలాగే నువ్వు కూడా మంచి మనసు కలిగిన అమ్మాయి”, “నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం స్వర్గంలో ఉన్న శ్రీదేవి ఆత్మకు శాంతి ఇస్తుంది” అంటూ అందరూ ఆమె మంచితనాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటివరకు గ్లామర్, ఫ్యాషన్, సినిమాల కోసం మాత్రమే చర్చకు వచ్చిన జాన్వి కపూర్, ఈసారి తన మానవత్వం కోసం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం జాన్వి కపూర్ పేరు ఇండస్ట్రీలో మరో లెవల్‌లో హైలైట్ అవుతోంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల కేటగిరీలో నిలబడటానికి ఆమె ఎంత కష్టపడుతోందో అందరికీ తెలుస్తోంది. ఇకపోతే, శ్రీదేవి వారసురాలిగా తల్లి పేరు నిలబెట్టేలా మంచి పనులు చేస్తూ, సినీప్రేమికుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.