
అయితే ఈ గ్యాంగ్ ఇలా కాల్పులు జరపడానికి ముఖ్య కారణం దిశా సోదరి ఖుష్బూ సాధువులను అవమానించినందుకే ఇలా చేసినట్లుగా ప్రకటించారు. హిందూ సాధువులు ప్రేమానంద్, అనిరుద్ధచార్య, మహారాజులను ఖుష్బూ అవమానపరిచారు అంటూ వారు ఆరోపణలు చేశారు. అయితే దిశా ఇంటి ముందు జరిగిన ఈ కాల్పుల విషయంపై పోలీసు అధికారులు కూడా కేసు నమోదు చేసి విచారించగా మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిపారని . అయితే ఈ రెండు కాల్పులు గాలిలోనే జరిపారని తెలియజేశారు.
ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోహిత్ గోదర గోల్ది బ్రార్ గ్యాంగ్ ఈ కాల్పులను తామే జరిపామంటూ సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్టును షేర్ చేస్తూ ఇది చిత్ర పరిశ్రమకు హెచ్చరిక అంటూ విడుదల చేశారు. వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ తో కలిసి ఖుష్బూ పటాని ఇంటిదగ్గర కాల్పులు జరిపామని.. సనాతన ధర్మాన్ని ఆమే కించపరిచేలా మాట్లాడిందని ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ హెచ్చరించారు.. ఇకమీదట సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే సనాతన ధర్మం గురించి అగౌరవంగా మాట్లాడితే ఏకంగా వారి ఇంట్లో ఎవరూ కూడా ప్రాణాలతో ఉండరంటూ హెచ్చరించారు. తమ మతాన్ని తాము కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని ఎంత దూరమైనా వెళ్తామంటూ హెచ్చరించారు. మరి ఈ విషయంపై దిశాపటానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.