అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ లో టెస్ట్ , వన్డే , టి 20 ఫార్మేట్ లో మ్యాచ్ లు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ మూడు ఫార్మాట్ లలో కూడా అత్యధిక స్కోరు ను సాధించిన రెండు జట్లు ఏవి ..? అనేది తెలుసుకుందాం.

టెస్ట్ ఫార్మేట్ లో శ్రీలంక జట్టు 952 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టు లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 903 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను చేసిన జట్లలో రెండవ స్థానంలో నిలిచింది.

వన్డే క్రికెట్ ఫార్మేట్ లో ఇంగ్లాండ్ జట్టు 481 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి వన్డే క్రికెట్ ఫార్మేట్ లో అత్యధిక పరుగులను చేసిన జట్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానం లో కూడా ఇంగ్లాండ్ జట్టు కొనసాగుతుంది. 444 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు వన్డే ఫార్మేట్లో అత్యధిక పరుగులను సాధించిన జట్లలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

టి 20 ఫార్మేట్ లో తాజాగా ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్లకు 304 పరుగులను టీ 20 ఫార్మేట్ లో చేసింది. టీ 20 ఫార్మేట్ లో అత్యధిక పరుగులను చేసిన జట్ల లో ఇంగ్లాండ్ మొదటి స్థానం లోకి వచ్చేసింది. ఇక రెండవ స్థానంలో 297 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఇండియా కొనసాగుతుంది.

ఇకపోతే ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ , వన్డే , టి 20 మూడు ఫార్మేట్ లలో కూడా అత్యధిక పరుగులను చేసిన జట్లలో కొనసాగుతుంది. ఇలా ఇంగ్లాండ్ జట్టు అన్ని ఫార్మేట్ లలో కూడా తనదైన రీతిలో అద్భుతమైన స్కోరులను సాధించి అద్భుతమైన రికార్డు లను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: