
టాలీవుడ్ పవర్ స్టార్ , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “ ఓజి ”. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం గత రెండున్నర సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా .. టోటల్ తెలుగు సినీ లవర్స్ అందరూ ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎన్నో రికార్డులు సెట్ చేస్తుందో అని ఇపుడు నుంచే ప్రతి తెలుగు సినీ అభిమాని లోనూ ఆసక్తి నెలకొంది. ఓజీ సినిమాకి కూడా ముందు రోజే తెలుగు స్టేట్స్ లో పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని ఇది వరకే టాక్ వచ్చింది.
తెలంగాణలో కొంచెం కష్టం అయితే ఏపీలో మాత్రం డెఫినెట్ గా ముందే షోస్ పడిపోతాయని తెలుస్తోంది. ఏపీ లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు అంటే సెప్టెంబర్ 24 రాత్రి 9 లేదా 9 గంటల 30 నిమిషాలకే షోస్ పడిపోయే ఛాన్స్ లు ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు