జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గత కొన్నేళ్లలో భారీ షాకులు తగిలాయి. పవన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.  అయితే ఓజీ సినిమాపై మాత్రం ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది. ఈ మూవీ బుకింగ్స్ 1.65 మిలియన్స్  దాటగా  రాబోయే రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

వరుసగా విజయాలు సాధిస్తున్న హీరోలు ఇలాంటి రికార్డులు సాధించడంలో పెద్దగా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సుజీత్ నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత  తెరకెక్కుతున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసిందని  చెప్పవచ్చు.

టాలీవుడ్ టైర్1 హీరోలలో చాలామంది హీరోలకు ఊహించని స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్నా సాధించలేని రికార్డులు పవన్ మాత్రం అలవోకగా సాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరోగా ఓజీ సినిమాతో సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఓజీ సినిమా ట్రైలర్ కు సంబంధించి అధికారిక అప్డేట్ రాలేదు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్  సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు క్రియేట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటుండగా త్వరలో పవన్ కొత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. సరైన సమయంలో పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన చేస్తారని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పవన్ పారితోషికం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే  సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: