
పూరి స్టైల్‌కి భిన్నంగా ఉంటుందని మొదట ప్రచారం జరిగినా.. సన్నిహితులు మాత్రం “ఇది పూరి మార్క్ మాస్ కంటెంట్” అంటున్నారు. పోకిరి, బిజినెస్ మెన్ తరహాలోనే పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్. ఈ సినిమా స్పెషల్ హైలైట్ ఏంటంటే.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి. ఆయన స్వయంగా పూరి సినిమాల డైలాగ్స్, ఎనర్జీ తనను ఆకట్టుకున్నాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కామెంట్‌తో పూరి మళ్లీ తన మార్క్‌తో వస్తున్నాడని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా జరుగుతోంది. సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
పూరి సినిమా అంటే ఆ ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్స్ తప్పకుండానే ఉంటాయి. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయింది. భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం విజయ్ సేతుపతి సహా ప్రధాన నటీనటులు పాల్గొంటున్నారు. గత కొన్ని సినిమాలు దెబ్బతిన్న తర్వాత స్టార్ హీరోలు పూరి నుంచి దూరమవుతున్న పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ హిట్ కొట్టడం పూరి కెరీర్‌కే కీలకమైపోయింది. బెగ్గర్ సినిమా పూరి బౌన్స్‌బ్యాక్ మూవీ అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్ డైలాగ్స్.. పంచ్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే.. పవర్‌ఫుల్ యాక్షన్ – ఇవన్నీ మళ్లీ పూరి మంత్రం రిపీట్ చేయబోతున్నాయా? అన్నది త్వరలో తేలనుంది.