తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నాగేశ్వరరావు గారు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ క్యాతి ని పెంచడం లో కూడా ఆయన తన వంతు కృషిని చేశాడు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే.

అందులో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సూపర్ హిట్ మూవీ లను కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... అక్కినేని నాగేశ్వరరావు గారి 101 వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమాలు అయినటువంటి ప్రేమాభిషేకం , డాక్టర్ చక్రవర్తి సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను సెప్టెంబర్ 20 వ తేదీ నుండి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇకపోతే ఈ మూవీ లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలను ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీ గా చూడవచ్చు.

అందుకు సంబంధించిన వెసులు బాటును కూడా ఇప్పటికే కల్పించారు. ప్రేమాభిషేకం , డాక్టర్ చక్రవర్తి ఈ రెండు సినిమాలను కూడా ఫ్రీ గా చూసే వెసులు బాటును కల్పించారు. ఇప్పటికే బుక్ మై షో లో ఈ సినిమాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అవి ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీ గానే ఈ మూవీ టికెట్స్ ను పొందవచ్చు. ఒక వేళ బుక్ మై షో లో కాకుండా మీరు నేరుగా థియేటర్ దగ్గరికి వెళ్లినా కూడా ఈ సినిమా యొక్క టికెట్లను ఫ్రీ గానే పొందవచ్చు. అలా అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా ప్రేమాభిషేకం , డాక్టర్ చక్రవర్తి సినిమాలను రీ రిలీజ్ లో భాగంగా ఫ్రీ గా చూసే పైసలు బాటను కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

anr