- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజిపై అభిమానుల్లో అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పవన్ కెరీర్‌లోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోందని ముందుగానే చెప్పడంతోనే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ట్రైలర్ విడుదల కాకముందే ఈ సినిమాకు వచ్చిన  ట్రెమండెస్ రెస్పాన్స్ చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షేక్ అవుతున్నాయి.


మ‌రీ ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో ఓజి రికార్డు స్థాయి ప్రీ సేల్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ 1.75 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. సాధారణంగా ట్రైలర్ లేదా ఆడియో రిలీజ్ తర్వాతే ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయి. కానీ, ఓజి విషయంలో మాత్రం ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ లేకపోయినా అభిమానులలో ఉన్న పవన్ క్రేజ్ కారణంగా టికెట్ సేల్స్ భారీ స్థాయిలో జరిగాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొన‌సాగితే ఓజీ సినిమా ట్రైలర్ రాకముందే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను సులభంగా అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.


ఇది పవన్ అమెరికా మార్కెట్‌లో కలిగి ఉన్న స్థాయిని మరోసారి రుజువు చేస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ యాక్షన్‌లో కనిపించడం అభిమానుల్లో అదనపు ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో లెవెల్ హైలైట్ కానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్, విడుదలైన రోజు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. మొత్తానికి, ట్రైలర్ రాకముందే ఈ స్థాయి రికార్డులు సెట్ చేసిన ఓజి, పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: