దసరా సీజన్‌ ఎప్పుడూ టాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమైనది. ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెండు భారీ సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ”, మరొకటి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రూపొందించిన “కాంతారా: చాప్టర్ 1”. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే – ఈసారి మేకర్స్ సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదే “లెస్ ప్రమోషన్ – మోర్ సస్పెన్స్”! పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఫ్యాన్స్‌కి పండగే. ఈసారి కూడా పరిస్థితి అదే. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓజీ ఇప్పటికే రిలీజ్‌కు వారం రోజులే మిగిలి ఉండగా, ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాలేదు. ట్రైలర్ ఫైనల్ కటింగ్‌లో ఉందని టాక్.
 

కానీ ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు మేజర్ హైలైట్ అవుతాయని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమా కోసం థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే ఇండియన్ సినిమాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. ఈ హైప్ వలననే మేకర్స్ ఎక్కువ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. పవన్ స్వయంగా రిలీజ్‌కి ముందు మూడురోజులు స్పెషల్ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ ఫిల్మ్‌లో ఇమ్రాన్ హాష్మి విలన్‌గా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి వంటి స్టార్ క్యాస్ట్ కనిపించనున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే వైరల్ అవుతోంది.



2022లో కాంతారా సినిమా సౌత్ నుంచి నార్త్ వరకు సంచలనం సృష్టించింది. అదే విజయానికి సీక్వెల్‌గా వస్తున్న కాంతారా: చాప్టర్ 1పై కూడా అంచనాలు భారీగా ఉన్న‌యి. కానీ ఈ సినిమాకి కూడా ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ లేవు. హోంబలే ఫిల్మ్స్ ట్రైలర్ ఒక్కటే రిలీజ్ చేసి, మినిమమ్ ప్రమోషన్‌ తోనే ముందుకు వెళ్తోంది. రిషబ్ శెట్టి విజన్, కాంటెంట్ పైనే మేకర్స్ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ దసరా బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే రెండు సినిమాలు – ఓజీ, కాంతారా: చాప్టర్ 1. ఫ్యాన్స్‌కి ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మరోవైపు రిషబ్ శెట్టి సెన్సిబుల్ స్టోరీ టెల్లింగ్. కానీ ఈసారి రెండు సినిమాల మేకర్స్ కూడా ప్రమోషన్స్ కంటే స్టార్ పవర్ & కంటెంట్ మీదనే గట్టి నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దసరా పండగలో ఎవరు దూసుకుపోతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: