
అయితే అలాంటి వారిలో తాజాగా ఈ సీజన్లో సుమన్ శెట్టి వచ్చారు.. యజ్ఞం,జయం,7/G బృందావన కాలనీ, బెండు అప్పారావు RMP, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన సుమన్ శెట్టి చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉండడం లేదు. అలా బిగ్ బాస్ 9 లో కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చినప్పటి నుండి కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఓటింగ్ లో మాత్రం సుమన్ శెట్టికే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.
అయితే అలాంటి సుమన్ శెట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు కృష్ణ భగవాన్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ.. బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ సినిమా సమయంలో కృష్ణ భగవాన్ గారు నన్ను ఘోరంగా అవమానించారు.నాకు సినిమాల్లోకి రావడం అదే కొత్త కావడంతో ఒక లెన్తి డైలాగ్ ని చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డా.. దాంతో అక్కడే ఉన్న కృష్ణ భగవాన్ గారు నా మీద కాస్త చిరాకుపడ్డారు.ఆయన ఆరోజు అలా ప్రవర్తించడంతో నా మనసు కలుక్కుమంది. చాలా ఇబ్బంది పడ్డాను. అయితే అప్పుడే సినిమాల్లోకి రావడం కొత్త కాబట్టి చాలామందితో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాను. కానీ ఆ తర్వాతే నాకు తెలిసింది కృష్ణ భగవాన్ గారు లెగ్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారని,అందుకే ఆరోజు అలా అన్నారని అర్థం చేసుకున్నాను అంటూ సుమన్ శెట్టి చెప్పుకొచ్చారు.