
ఏదో మనసులో పెట్టుకుని దీపికా పదుకొనేని ఈ సినిమాలో నుంచి తీసేశారు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక దీపిక ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు – “ఒక హీరోయిన్‌ని ఇలా టార్గెట్ చేసి ఇండస్ట్రీ నుంచి తొక్కేయడం కరెక్టేనా? ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే లేదా కొన్ని కోరికలు పెడితే, తీర్చలేకపోతే ఇలా తీసేయడం సరైనదా?” అని ప్రశ్నిస్తున్నారు.గతంలో కూడా దీపికా ఇలాంటి కోరికలే కోరింది,, కానీ అప్పటివరకు ప్రతి ఒక్కరూ తీర్చారుగా. తాజాగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి ఆమెను తీసేయగానే ఈ ఇష్యూ పెద్దది అయ్యిందా..? ఇప్పుడు మిగతా సినిమాల నుంచి కూడా ఇలా తీసేస్తున్నారా? ఇది కావాలనే దీపికని టార్గెట్ చేయడమేనా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు.
దీపికా తన కెరీర్ స్టార్ట్ నుంచే ఇలాంటి కండిషన్స్ పెడుతూనే వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటివరకు సమస్యలేకపోయింది, ఇప్పుడు ఎందుకు? దీని వెనక అసలు కారణం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచే తీసేయడం వల్లే కదా? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.అలాగే కొంతమంది మాత్రం – “ప్రభాస్ ఈ విషయం మీద నోరు విప్పాలి. స్పిరిట్ సినిమా నుంచి దీపికని తీసేటప్పుడు కూడా సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంటే ప్రభాస్ ఇమేజ్‌కే డ్యామేజ్ అవుతుంది” అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
మరి మీరేమనుకుంటారు? దీపికా పదుకొనే విషయంలో ఇండస్ట్రీ పెద్దలు తీసుకుంటున్న ఈ నిర్ణయం కరెక్టేనా? ఆమె డిమాండ్స్‌కి కట్టడి చేయాలి అంటే ఇలాంటి నిర్ణయాలే సరైనవా? లేకపోతే సందీప్ రెడ్డి వంగ ఇష్యూని పక్కన పెట్టి కావాలనే దీపికపై ఇలా తీర్చుకుంటున్నారా?మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి...!!