‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట కొట్ట‌డంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరో తేజ సజ్జ నటన, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, విల‌న్ రోల్ చేసిన‌ మంచు మనోజ్ పాత్ర కూడా అంతే చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకున్న మనోజ్, తొలిసారి నెగటివ్ షేడ్స్ కలిగిన రోల్‌లో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మనోజ్ పోషించిన విలన్ రోల్ సినిమాలో కీలకంగా నిలిచింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేశాయి. చాలామంది విమర్శకులు కూడా ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి, ‘మిరాయ్’ హిట్ అవ్వ‌డం వెన‌క మనోజ్ విలన్ పాత్ర ఒక ప్రధాన బలం.


ఇక విలన్‌గా మారిన వెనుక ఆసక్తికరమైన కారణాన్ని మనోజ్ చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం తీసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సలహా కారణం అని తెలిపారు. ఒకసారి పవన్ కళ్యాణ్‌ను కలిసినప్పుడు, “నువ్వు విలన్‌గా చేస్తే మామూలుగా ఉండదు. ఒక్కసారి ట్రై చెయ్. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టు అయిపోతావ్” అని పవన్ అన్నారట. ఆ మాటలు తనలో నమ్మకాన్ని నింపడంతోనే ఈ పాత్రకు ఓకే చెప్పానని మనోజ్ చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సలహా విన్న మనోజ్, తొలిసారి విలన్‌గా చేసిన ప్రయత్నం సూపర్ హిట్ అవడం విశేషం. దీంతో మనోజ్ కెరీర్‌లో కొత్త జోన్ తెరవబడింది. భవిష్యత్తులో కూడా ఆయనకు ఇలాంటి నెగటివ్ రోల్స్ వరుసగా వచ్చే అవకాశం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: