టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన ఈమేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చిన కూడా మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్లు లభిస్తూ ఉంటాయి. అదే ఆయన నటించిన సినిమాలకు మంచి టాక్ వచ్చినట్లయితే ఆ సినిమాలకు బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి.

దానితో ఈ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కలెక్షన్ల వర్షాన్ని బాక్సా ఫీస్ దగ్గర కురిపిస్తుంది అని కూడా చాలా మంది అంచనా వేశారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తేదీన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను పెద్ద ఎత్తున ప్రదర్శించారు.

వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ సినిమా ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్లతో కలుపుకొని ఈ సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో 50 శాతం రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతోనే 50 శాతం బిజినెస్ను రికవరీ చేసింది అనే వార్తలు బయటకి రావడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: