
ఇది సాధారణ హీరోల సినిమాలకే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ హ్యాపీనెస్, ఈ ఆనందం, ఈ హంగామా పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ సౌండ్స్‌కే థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. రీసెంట్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ . నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ మేనరిజం. "పవన్ కళ్యాణ్‌ని ఇలాగే చూడాలి అనుకున్నాం" అంటూ ఫ్యాన్స్ బాగా హైప్ చేస్తున్నారు. సుజిత్ ఒక డైరెక్టర్ అని మర్చిపోయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌లా ఈ సినిమా తెరకెక్కించాడు అని ప్రతి అభిమాని థియేటర్‌లో ఫీలయ్యాడు.
పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకున్నారో, ఆ రేంజ్‌లో చూపించి అభిమానుల మనసు గెలిచేశాడు. థియేటర్‌లో ఫ్యాన్స్ అరుస్తూ, కేకలు వేస్తూ, పేపర్లు ఎగరేస్తూ, ఆనందంలో తమ షర్ట్లు తామే చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం ఒక సెన్సేషనల్ ప్రకటన విడుదల చేసింది."అభిమానులు సినిమా చూస్తూ అమితానందంలో టీషర్ట్స్ చించేస్తున్నారు. అందుకే సినిమా చూడడానికి వచ్చే వాళ్లు తమతో పాటు అదనంగా ఒక టీషర్ట్ క్యారీ చేయాలి" అని ఒక ప్రకటన చేసింది. ఇంతవరకు ఏ సినిమా విషయంలోనూ ఇలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం."ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సత్తా" అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంత స్థాయిలో మ్యూజిక్ ఉందని, తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది పొగడ్తలు కురిపిస్తున్నారు.
