
ఇది ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సగం కంటే ఎక్కువ రికవరీ అని చెప్పుకోవాలి. కొన్ని ఏరియాల్లో ఓజీ సినిమా బాహుబలి 1, ఆర్ఆర్ఆర్, సలార్, దేవర, కల్కి వంటి భారీ సినిమాల రికార్డులను చెరిపేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా ఊహించని రీతిలో రాంపేజ్ చేస్తోంది. నైజాం లో తొలి రోజు దాదాపు ₹24.4 కోట్ల షేర్ వసూలు చేసి, అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ లిస్టులో ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి మాత్రమే కాకుండా, పుష్ప 1 సృష్టించిన ఆల్‌టైమ్ రికార్డ్ కూడా సవాల్‌కి గురైంది. ప్రస్తుతం పుష్ప సినిమా 25 కోట్లతో టాప్ పొజిషన్‌లో ఉండగా, ఓజీ చాలా దగ్గరగా చేరడం విశేషం.
అభిమానులు సోషల్ మీడియాలో దీనిని భారీగా హైలైట్ చేస్తున్నారు. “నైజాంలో ఓజీ ఊచకోత మామూలుగా లేదు. ఈ ర్యాంపేజ్ ఇంకో 10–12 రోజులపాటు ఆగదు” అంటూ సంబరాలు చేస్తున్నారు. నైజాం మాత్రమే కాదు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇదే సెన్సేషన్ కొనసాగుతోంది. అక్కడ మొదటి రోజే ఓజీ సినిమా 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆల్‌టైమ్ రికార్డ్ కొల్లగొట్టింది. దీంతో ఈస్ట్ గోదావరిలో కూడా పవన్ సినిమా ఓ అద్భుతమైన రికార్డ్‌ని సృష్టించింది. సినిమా రిలీజ్ అవ్వగానే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా భగ్గుమంటూ వసూళ్లు సాధిస్తోంది. పవన్ కళ్యాణ్ కరిష్మా.. అభిమానుల క్రేజ్, సుజిత్ టేకింగ్, తమన్ అందించిన థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్—అన్ని ఓజీ సినిమాని మాసివ్ ర్యాంపేజ్ దిశగా తీసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.“ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఇంత భారీగా తెరపై రాంపేజ్ చేయగలగడం పవన్‌కే సాధ్యం” అంటూ సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.ఓజీ మొదటి రోజు నుండే ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం పవన్ స్టార్డమ్‌కు నిదర్శనం. ఇక రాబోయే రోజుల్లో వసూళ్లు ఇంకా పెరిగితే, ఇది ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం ఉన్నట్టే.