
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఓజీ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే భారీ రికార్డులు సెట్ చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లోనూ మంచి నెంబర్స్ సెట్ చేసుకుంది. సీడెడ్ - ఏపీ - నైజాం - ఓవర్సీస్ ఇలా ఎక్కడ చూసినా ఓజీ మానియా అయితే మామూలుగా లేదు. నైజాంలో డే రు . 24 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా సీడెడ్ లో డే 1 అదర గొట్టేసింది. భారీ రికార్డులు సెట్ చేస్తూ దూసుకు పోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి నంబర్స్ సెట్ చేస్తున్న ఓజి సీడెడ్ లో దుమ్ము దులిపేసింది. డే 1 అయితే పీఆర్ లెక్కల ప్రకారం రు. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
ఓవరాల్ గా సీడెడ్ లో డే 1 10. 3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇది కూడా జీఎస్టీతో కలిపి వచ్చిన వసూళ్లు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది మరో సాలిడ్ మార్క్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి ఇంకా ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు