కొన్ని సార్లు ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లయితే కొంత మంది నటీ నటులు ఆ విషయంలో ట్రోల్స్ ను ఎదురుకోవడం జరగడం సర్వసాధారణమైన విషయం. కానీ కొంత మంది నటీ నటులు ఏ విషయం పై స్పందించకపోయినా దానితో వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాలలో కొంత మంది చేత ట్రోలింగ్ కి గురవుతారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... రష్మిక కన్నడ సినిమా అయినటువంటి కిరీక్ పార్టీ మూవీతో వెండి తెరకు పరిచయం అయింది.

సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఇక కన్నడలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా విడుదల అద్భుతమైన విజయం వైపు దూసుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి రష్మిక ఎక్కడ స్పందించలేదు. దానితో చాలా మంది ఈమెపై విమర్శలు చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం రష్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అయినటువంటి కిరీక్ పార్టీ మూవీ కి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు.

దానితో ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆయన నటించి , దర్శకత్వం వహించిన సినిమా మంచి విజయం సాధిస్తే ఎందుకు స్పందించడం లేదు అని కొంత మంది ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం ఆమె సినిమా చూసి ఉండకపోవచ్చు , ఆమె ఎంతో బిజీగా లైఫ్ ను గడుపుతుంది. అలాంటి సమయం లో అన్ని విషయాలపై  స్పందించాల్సిన అవసరం లేదు అని కొంత మంది ఆమెను సమర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm