- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

సమంత, నాగచైతన్య ప్రేమకథ ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. “ఏ మాయచేసావే” సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారి, 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు ఆనందంగా గడిపిన తర్వాత 2021లో విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ప్రేమతో మొదలైన ఈ బంధం ఎందుకు ముగిసిందనే విషయం అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. కానీ వారి విడాకుల వెనుక ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.


టాలీవుడ్‌లో చక్కగా సాగుతున్న సామ్ - చైతూ దాంపత్య జీవితం మధ్యలో ఒక వ్యక్తి చిచ్చు పెట్టాడని కొత్త గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. ఆ వ్యక్తి దర్శకుడు రాజ్ నిడిమోరు అని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. సమంత, రాజ్ నిడిమోరు దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌లో సమంత బోల్డ్ రోల్ చేయడం నాగచైతన్యకు నచ్చలేదని టాక్. ఆ సమయంలోనే రాజ్‌తో సమంత సన్నిహితంగా మెలగడం చైతు - సామ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మైంద‌ని ప్ర‌చారం ఉంది.


తరువాత సిటాడెల్: హనీ బన్నీ ప్రాజెక్ట్‌లో కూడా రాజ్ దర్శకత్వంలో సమంత నటించడంతో ఈ దూరం మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు. పరిశ్రమలో వినిపిస్తున్న మాటల ప్రకారం, రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితత పెరగడం వల్లే చైతూ, సమంత మధ్య విభేదాలు తలెత్తి, చివరికి విడాకులకు దారితీసిందట. ఇటీవల కూడా సమంత, రాజ్ నిడిమోరు ముంబైలో తరచూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. జిమ్ బయట ఇద్దరూ కనిపించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు తిరుమల దర్శనంలో, సమంత నటించిన సినిమా సక్సెస్ ఈవెంట్‌లో కూడా రాజ్ హాజరవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: