
ఎస్ ఇప్పుడు ఇదే విషయం తెలుగు మీడియా వర్గాల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ అన్నా.. తెలుగు నిర్మాతలు అన్నా ఇప్పుడు అందరికి చులకన అయిపోయారు. బాలీవుడ్ హీరోయిన్లను అక్కడ ఎవ్వరూ దేకరు.. ఎట్టరు పట్టించుకోరు .. అదే వాళ్లకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తే చాలు గొంతెమ్మ కోర్కెలు కోరతారు. భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేయడంతో పాటు తమ పరివారం ఓ 15 మందిని కూడా తీసుకు వస్తాం.. వారి ఖర్చులు కూడా భరించాలని కండీసన్లు పెడతారు. మళయాళ హీరోయిన్లకు అక్కడ రెమ్యునరేషన్ చాలా తక్కువ. అదే వారికి తెలుగు లో అవకాశం ఇస్తే అక్కడితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తారు.
దుల్కర్ సల్మాన్ కు మళయాళంలో చాలా తక్కువ రెమ్యునరేసన్ ఇస్తారు. తెలుగులో ఒకటి రెండు డైరెక్ట్ సినిమాలు చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ మళయాళంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న పరిస్థితి ఉందట. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఓ తెలుగు దర్శకుడు.. తెలుగు ప్రొడ్యూసర్‌ని వెంట బెట్టుకొని తమిళ హీరో ధనుష్‌ని కలిసి, కథ చెబితే.. సినిమా చేయడానికి రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడని సమాచారం. విచిత్రం ఏంటంటే తమిళంలో ధనుష్‌కు తీసుకొంటోంది రూ.35 కోట్లలోపే ఉంది. మరి తెలుగులో మాత్రం ఇంత ఎందుకు ? అంటే మన పిచ్చి ( అదే సినిమా పిచ్చి ) ఉన్న నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు అన్న ధీమా వారిలో ఉండడమే.. !
పైగా తమిళ, కన్నడ, మళయాళ డబ్బింగ్ సినిమాలను కూడా మనం నెత్తిన పెట్టుకుంటున్నాం.. అదే మన తెలుగు సినిమాలను అక్కడ డబ్బింగ్ చేస్తే పట్టించుకునే వాడే ఉండడం లేదు. మనం మాత్రం వారి సినిమాలు ఇక్కడ డబ్బింగ్ చేస్తే కోట్లు కుమ్మరిస్తున్నాం. తాజాగా కాంతారా చాప్టర్ 1 సినిమానే ఇందుకు ఉదాహరణ. ఏదేమైన మన తెలుగు సినిమా నిర్మాతలు ఇస్తున్నంత కాలం వాళ్లను బకరాలు చేసి దోచుకునే వాళ్లు దోచుకుంటూనే ఉంటారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు