తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలు అందుకున్నాడు. కొన్ని సంవత్సరాలు మాత్రం శర్వానంద్ వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటూ వచ్చాడు. అలాంటి సమయం లోనే ఈయన ఒకే ఒక్క జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయన తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఆఖరుగా ఈయన మనమే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ప్రస్తుతం శర్వానంద్ "నారీ నారీ నడుమ మురారి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆల్మోస్ట్ ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శర్వానంద్ గతంలో నటించిన ఎక్స్ ప్రెస్ రాజా , శతమానం భవతి సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అలా ఇప్పటివరకు శర్వానంద్ నటించిన రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యి మంచి విజయాలు సాధించడంతో  నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని శర్వానంద్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: