సుజిత్ ఏం చేసినా సరే, అభిమానుల మనసులో ఏముందో అర్థం చేసుకొని, వాళ్లు ఎలా ఎంటర్టైన్ అవుతారు అన్నదానిపై ఎంతో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే డెడికేషన్, విజన్, ప్రెజెంటేషన్ స్టైల్ చూసినా అది స్పష్టంగా తెలుస్తుంది. సుజిత్ కి సినిమా అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, అది అభిమానులను థియేటర్‌లోకి లాక్కెళ్లే ఒక ఎమోషనల్ జర్నీ.ఈ విషయం మొదటిసారి ప్రేక్షకులకు సాహో సినిమాతో అర్థమయింది. ఆ సినిమా ద్వారా ఆయన తన టెక్నికల్ సెన్స్, విజువల్ గ్రాండియర్, మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ని బలంగా చూపించారు. అప్పట్లో చాలా మందికి సుజిత్ అంటే “యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్” అనే ఇంప్రెషన్ మాత్రమే ఉండేది. కానీ ఆయన తాజా సినిమా ఓజి చూసిన తర్వాత మాత్రం అందరి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.


ఓజి సినిమా ద్వారా సుజిత్ తన డైరెక్షన్‌లో ఉన్న లోతు, పేసింగ్‌, ఎమోషన్ హ్యాండ్లింగ్‌ ని అద్భుతంగా ప్రూవ్ చేశారు. ఫ్యాన్స్‌ మాటల్లో చెప్పాలంటే — “సుజిత్ ఇక సాధారణ డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీని షేక్ చేసే పాన్ ఇండియా విజనరీ డైరెక్టర్” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక హీరోని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో, ఆ హీరోని స్క్రీన్‌పై అదే రీతిగా చూపించే తెరకెక్కించే స్టైల్ ఆయనదే అని అందరూ అంటున్నారు. అయితే ఓజి  ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినా, సుజిత్ మాత్రం ఎప్పటిలాగే చాలా సైలెంట్‌గా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటూ, “హిట్ కొట్టాననే ఉత్సాహం లేకుండా, సాధారణంగా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు”. అదే ఆయన మనసులో ఉన్న సింప్లిసిటీకి నిదర్శనం. ఫ్యాన్స్ కూడా సరదాగా “ఇదే అసలైన డౌన్ టు ఎర్త్ అట్టిట్యూడ్ అంటారేమో!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



ఇప్పుడు సుజిత్ తన తదుపరి సినిమాగా నేచురల్ స్టార్ నానిని హీరోగా డైరెక్ట్ చేయబోతున్నారనే విషయం అందరికి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధించిన పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు — “హీరోయిన్ ఎవరు?”, “విలన్‌గా ఎవరు నటిస్తున్నారు?”, “ఇది ఓజీ యూనివర్స్‌కి సంబంధించిన సినిమా భాగమా?”, “లేదా కొత్త కాన్సెప్ట్‌తో వస్తుందా?” అంటూ ట్రెండ్ చేస్తున్నారు.



ఇప్పటివరకు వైరల్ అవుతున్న ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, విలన్ పాత్రలో ఓజీ సినిమాలో కనిపించిన అర్జున్ దాస్ నే తీసుకున్నారట. దీంతో నెటిజన్లు “ఇది ఓజీ యూనివర్స్‌లో భాగమై ఉంటుందేమో?” అంటూ ఊహాగానాలు చేస్తున్నారు.ఇప్పటివరకు ఈ వార్తలపై సుజిత్ గానీ, నాని గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు. నానిసుజిత్ కాంబినేషన్ ఏ స్థాయిలో థ్రిల్, ఎమోషన్, యాక్షన్ ని ఇవ్వబోతోందో చూడాలి మరి. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ చూస్తే, ఇది వచ్చే ఏడాది అత్యంత క్రేజీ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం అనిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: