
ఇక దీంతో పాటుగా ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న స్పిరిట్ నుంచి కూడా దీపిక ని తొలగించడం జరిగింది . ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి అన్న దానిపై సినీ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి . ప్రజెంట్ కల్కి పార్ట్ 2 లో హీరోయిన్ మార్పు సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారింది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఆలియా భట్ ఈ పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయని సమాచారం . ఈ మేరకు చిత్ర బృందం మరియు ఆలియా మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు ముంబై సినీ వర్గాలు వెల్లడించడం జరిగింది .
అన్ని వివరాలు కార్యాలైనా తరువాతనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది . ఇక కల్కి పార్ట్ 2 లో దీపికా స్థానంలో పలువురు అగ్ర తారల పేర్లు వినిపిస్తుండగా ప్రెసెంట్ ఆలియా పేరే చాలా బలంగా నిలబడింది . ఇక ఈ సినిమా టైటిల్ గా కర్ణ 3102 బిసి అనే పేరు పరిశీలనలో ఉండని కూడా తెలుస్తుంది . ఇక జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . దీపిక తప్పుకోవడం ఆలియా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీపై హాలీవుడ్ స్టైల్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం ఆలియా సైలెంట్ గా ప్రాజెక్టులు ఓకే చేస్తూ వెళ్తుంది . ఇక ఇప్పుడు కల్కి 2 లో కూడా ఓకే అయితే ఆమె కెరీర్ మరింత మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు .