న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ అఖండ 2 – తాండవం ” సినిమా. ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన చిత్రంగా నిలుస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ అంటేనే అభిమానుల్లో ఊహించలేని స్థాయిలో ఎక్సైట్మెంట్‌ ఉంటుంది. ఈ జంట ఇచ్చిన హిట్‌ ఫార్ములా కారణంగా, ఈ సారి అంచనాలు మరింత పెరిగాయి. హీరోయిన్‌గా సంయుక్త, అలాగే బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


ఇప్పటికే షూటింగ్ చివరి దశలోకి చేరుకున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన టాక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫస్టాఫ్ పూర్తిగా సెటప్‌, ఎమోషన్స్‌తో నిండిపోతే, సెకండాఫ్ మాత్రం బోయపాటి మార్క్ యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్‌తో నాన్‌స్టాప్ ఎనర్జీని పంచబోతోందని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్‌లో బాలయ్య ఆవిష్కరణ, రుద్ర అవతారంలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని టాక్‌ ఉంది.
చాలా సినిమాలు సెకండాఫ్‌లో డెప్త్ కంటెంట్‌ను కోల్పోతున్నాయనే విమర్శలు వస్తున్నా, “అఖండ 2” మాత్రం ఆ సెంటిమెంట్‌కి పూర్తిగా విరుద్ధంగా ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.


ఫస్టాఫ్‌ బాగున్నా, సెకండాఫ్‌నే అసలు హైలైట్‌గా మార్చడంలో బోయపాటి మరోసారి తన డైరెక్షన్‌ నైపుణ్యాన్ని చూపించాడట. పాన్‌ ఇండియా లెవెల్లో ఈ సినిమా కోసం భారీగా స్క్రీన్లు రెడీ అవుతున్నాయి. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, డివోషనల్ ఇంపాక్ట్‌తో “అఖండ 2 – తాండవం” ఈ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి కూడా బాలయ్య మాస్‌ తాండవం తిరిగి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: