ఏంటి ఎనర్జిటిక్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రామ్ పోతినేనికి నిజంగానే ఎఫైర్ ఉందా.. అందుకే ఇంత ఏజ్ వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదా ఇంతకీ రామ్ పోతినేని పర్సనల్ సీక్రెట్ ని బయటపడేసినా ఆ నటుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా అనే మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించి రెండు నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు హీరో రామ్ పోతినేని. ఇందులో భాగంగా తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలో పాల్గొన్నారు.ఇక ఈ టాక్  షో కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ప్రోమోలో మాట్లాడుకున్న విషయాలన్ని నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక విషయం ఏమిటంటే.. జగపతిబాబు షో కి రామ్ పోతినేని రావడంతోనే నువ్వు అమ్మ నాన్నతో కలిసి ఉండకుండా ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నావ్ అంటే కచ్చితంగా నీకు ఎవరితోనైనా ఎఫైర్ ఉండే ఉంటుంది అంటూ చెప్పేశారు.

 ఇక జగపతిబాబు మాటలకు షాక్ అయిన రామ్ పోతినేని లవ్ అని చెప్పండి ఒప్పుకుంటాను.కానీ మరీ ఎఫైర్ ఏంటండీ బాబు అన్నట్లుగా నవ్వుతూ కొట్టి పారేశారు.అలాగే రామ్ పోతినేనిని చాలామంది హీరోయిన్లను ఆటపాటిస్తున్నావుగా అని  జగ్గూ భాయ్ అడిగితే దానికి ఆయన నవ్వేస్తారు. అలాగే నీ లైఫ్ లోని ప్రేమ విషయాలు చెప్పమని జగపతిబాబు అడగగా.. నేను ఒక అమ్మాయిని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను.కానీ నా వెనకాల మాత్రం ఎంతోమంది అమ్మాయిలని తిప్పుకున్నాను అంటూ తాను చేసిన చిలిపి పనులను ఒప్పుకున్నారు రామ్ పోతినేని.

ఇక ఇందులో రామ్ పోతినేని కి సంబంధించిన పర్సనల్ విషయాలు మరిన్ని తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఫుల్ ఎపిసోడ్ లో జగపతిబాబు రామ్ పోతినేని నుండి ఇంకా ఎన్ని విషయాలు బయటకు లాగుతారు.. ఆయన పెళ్లికి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా అనేది చూడాలి. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో ఒక హీరో కోసం అభిమాని ఎంతలా కష్టపడతాడు అని ఒక అభిమాని కథను చూపించబోతున్నారు. ఈ మూవీలో కీ రోల్ ఉపేంద్ర పోషించగా.. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: