ఈరోజు వాడ్ని కుమ్మాల్సిందే.. మాకు అప్పజెప్పండి అంటూ బిగ్ బాస్ భరణి శంకర్ పై ఆడోల్లంతా ఫైర్ అయ్యారు.. అయినా బిగ్ బాస్ లో ఆయన తప్పుగా ఏమి ప్రవర్తించడం లేదు..ఎందుకు ఆడవాళ్లు ఆయనపై ఫైర్ అవుతారని మీకు డౌట్ రావచ్చు. కానీ బిగ్ బాస్ చూసి ఆడవాళ్లు ఫైర్ అయ్యారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఇక అసలు విషయం ఏమిటంటే..భరణి శంకర్ చి.ల. సౌ స్రవంతి అనే సీరియల్లో నెగిటివ్ రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు. ఈ సీరియల్లో హీరోయిన్ ని విలన్ విసిగిస్తూ ఉంటే చాలామంది ఆయన్ని తిట్టుకునేవారు.ఈ సీరియల్ లో విలన్ పాత్ర పోషించిన భరణి శంకర్ కి లైవ్ లో ఓ చేదు అనుభవం ఒకసారి రైల్వే స్టేషన్లో ఎదురైందట.. చి.ల.సౌ స్రవంతి 100 ఎపిసోడ్స్ పూర్తి అవ్వడంతో తిరుపతిలో సెలబ్రేషన్స్ చేద్దామని నిర్మాత అనుకున్నారట.


దాంతో అందరూ తిరుపతి వెళ్ళిన టైం లో రైలు ఓ స్టేషన్లో ఆగితే భరణి శంకర్ ఏమో తిందామని దిగారట. కానీ ఆ సమయంలో అక్కడే పని చేసే కొంత మంది ఆడవాళ్లు సీరియల్ లో ఆ అమ్మాయిని విసిగించేవాడు వీడే రా అంటూ కన్ఫామ్ చేసుకొని ఏకంగా వాళ్ళ చేతిలో ఉండే పారా,గడ్డపార వంటివి పట్టుకొని వచ్చి ఒరేయ్ నువ్వే కదా ఆ అమ్మాయిని అంతలా వేధించే వాడివి.. ఈరోజు నువ్వో మేమో తేలిపోవాలి.. నీ అంత చూస్తాం అంటూ మండిపడ్డారట.అయితే ఆడవాళ్ళందరూ ఒకేసారి అలా గుమి గూడే సరికి భరణి శంకర్ కి ఏం చేయాలో అర్థం కాలేదట.నిర్మాత వచ్చి వాళ్లకు నచ్చజెప్పినా వినకుండా సార్ ఒకసారి మాకు వీడిని వదిలేయండి. కుమ్మి పడేస్తాం.

 ఈరోజు వీడి సంగతి తేలాల్సిందే అని మండిపడ్డారట. కానీ అది సీరియల్ లో భాగమమ్మా అని నిర్మాత చాలా సేపు నచ్చజెప్పి చివరికి ఆడవాళ్లందరినీ అక్కడి నుండి పంపించారట. అయితే ఈ విషయాన్ని భరణి శంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైంలో బయటపెట్టారు.అలా భరణి శంకర్ పాత్ర సీరియల్ ద్వారా జనాల్లోకి ఎంత బలంగా వెళ్లిందో ఈ ఒక్క సంఘటన చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే చి.ల. సౌ స్రవంతి నిర్మాత భరణి శంకర్ ని కలిసినప్పుడల్లా ఆరోజు స్టేషన్లో ఆడవాళ్లంతా నిన్ను కొట్టడానికి అలా పరిగెత్తారు ఏంటయ్యా అని నవ్వేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి: