పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న సినిమాల సరసన మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘స్పిరిట్‌’ అనే టైటిల్ ఖరారైంది. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్‌’ వంటి భిన్నమైన భావోద్వేగాలతో కూడిన కథలను అందించిన సందీప్‌ రెడ్డి, ఈసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో రావడం సినిమాపై మరింత క్రేజ్ పెంచింది.


ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ ప్రత్యేకమైన కొత్త గెటప్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఆ సన్నివేశం సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ కొత్త లుక్, ఆ యాక్షన్ బ్లాక్ ప్రదర్శన థ్రిల్లింగ్‌గా, అలాగే స్టైలిష్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.


ప్రభాస్‌తో ఆమె ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా కొత్తగా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో చర్చ. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవించి ప్రత్యేకమైన సౌండ్ డిజైన్‌తో ఆల్బమ్ రాబోతుందని సమాచారం. ‘స్పిరిట్‌’ సినిమాను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్ స్థాయిలో షూటింగ్ జరగనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కథాంశం, ప్రభాస్ కొత్త లుక్‌, సందీప్ రెడ్డి వంగా మాస్ టచ్ ... ఈ మూడింటి కలయికతో ‘స్పిరిట్‌’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజెంట్ ఇదే టాపిక్ సోషల్ మీడియాలో .. వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: