కీర్తి చెప్పినట్లుగా —“మహానటి తర్వాత ఇండస్ట్రీలో నా మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనుకున్నాను. కానీ పరిస్థితి ఏమైందంటే… చాలా మంది నన్ను అదే తరహా పాత్రల్లో మాత్రమే ఊహించడం ప్రారంభించారు. నన్ను ఒక ప్రత్యేకమైన, క్లాసికల్ క్యారెక్టర్ ఇమేజ్‌లో బంధించేశారు. అందుకే కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు రాలేదు” అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు,“మహానటి విడుదలైన తర్వాత దాదాపు ఆరు నెలలు వరకూ ఒక్క కథ కూడా చెప్పలేదు. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయింది. కానీ నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం ఇమేజ్ కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి. దాన్ని నేను నెగిటివ్‌గా కాక, పాజిటివ్‌గా తీసుకున్నాను” అని చెప్పింది.
ఈ గ్యాప్ సమయంలో కీర్తి తన శైలిలో, బాడీ లాంగ్వేజ్‌లో, ఫిట్‌నెస్‌లో పూర్తి స్థాయి మార్పులు చేసుకుంది.“ఆ సమయాన్ని నేను పూర్తి మేకోవర్ కోసం ఉపయోగించుకున్నాను. కొత్తగా చూసే విధంగా నా ప్రెజెంటేషన్ మార్చుకున్న తర్వాతే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ సినిమాల వల్ల నా రేంజ్ మళ్లీ పెరిగింది” అని ఆమె వెల్లడించింది.
అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఈ విషయాన్ని వెటకారంగా మార్చారు.“నీకు నేషనల్ అవార్డ్ వచ్చినా దేనికి పనికిరాలేదు కదా?” .. “ఒక పాత్ర బాగా చేశావు… కానీ అందుకే అందరూ అదే పాత్రల్లో వేయాల్సిన అవసరం లేదు” అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, కీర్తి అభిమానులు మాత్రం ఆమె మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో టైప్‌కాస్టింగ్ ఒక పెద్ద సమస్య… ఒకసారి గ్లామర్ రోల్ చేస్తే గ్లామర్ రోల్ మాత్రమే, ఒకసారి క్లాసీ పాత్ర చేస్తే అలాంటి పాత్రలే ఇస్తారని వాళ్లు సమర్థిస్తున్నారు.ఏదేమైనా,‘మహానటి’తో దేశాన్ని మెప్పించిన కీర్తి సురేష్ ఎదుర్కొన్న ఈ ఒత్తిడి, గ్యాప్, మేకోవర్ – ఇవన్నీ ఆమె కెరీర్‌లో మరో కొత్త మలుపు తిప్పాయి. ప్రస్తుతం ఆమె మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి