
రిషిబ్ శెట్టి రీసెంట్గా కాంతారా చాప్టర్ 1 సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందుకు కాంతార సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు . ఇలాంటి టైంలోనే రిషిబ్ శెట్టి కి సంబంధించిన పర్సనల్ విషయాలు సైతం ఎక్కువుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రిషబ్ శెట్టి దేవుని బాగా నమ్ముతాడు . ఆ విషయం అందరికీ బాగా తెలుసు. కాంతర చూస్తే ఆ విషయం బాగా అర్ధం అయిపోతుంది. అయితే రిషిబ్ శెట్టి ఓరిజినల్ నేమ్ అది కాదు ప్రశాంత్ శెట్టి . ఆయన తన పేరుని మార్చుకున్నాడు . అలా పేరు మార్చుకుంటేనే హిట్ కొట్టగలవు అంటూ ఓ జ్యోతిష్కుడు చెప్పిన విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు రిషిబ్ శెట్టి .
కోస్తా కర్ణాటకలోని ఓ చిన్నపాటి గ్రామం నుంచి వచ్చిన ఆయన నటుడిగా చిత్ర నిర్మాతగా..డైరెక్టర్ గా అద్భుతమైన కెరియర్ ని నిర్మించుకున్నాడు . మంచి నటన కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రిషిబ్ శెట్టి . అయితే తాజాగా ఆయన తన పేరుని ఎందుకు మార్చుకున్నారు అన్న విషయాన్ని బయట పెట్టాడు . "నా పేరు రిషిబ్ శెట్టి కాదు..నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాను అంటే.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి అదే పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ పెద్దగా హిట్టు కొట్టలేదు . చాలా ఏడ్చాను . నేను నటించిన సినిమాలు అస్సలు జనాలు చూడలేదు. బాగా బాధపడ్డాను . అదే సమయంలో నా పేరు మార్చుకోమని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయన మరెవరో కాదు నా తండ్రి . అప్పటికే ఇండస్ట్రీ లోకి వచ్చిన వారందరూ కూడా పేర్లు మార్చుకుంటున్నారు. దీనితో నేను కూడా పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను ..ప్రశాంత్ శెట్టి అనే పేరుని మా నాన్న నాకు రిషిబ్ శెట్టిగా మార్చారు .. ఆ తర్వాత నా కెరియర్ ఎలా దూసుకుపోతుంది అనేది మీరు చూస్తున్నారు. నా తండ్రి స్వయంగా నాకు ఈ పేరు పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు". రిషిబ్ శెట్టి తండ్రి జ్యోతిష్కుడు కావడం ఆయనకు బిగ్ ప్లస్ పాయింట్ గా మారింది అంటున్నారు జనాలు. దీంతో ఫ్యాన్స్ ఇక ఆయనను ప్రశాంత్ శెట్టి అని పిలవకండి..ఓన్లీ రిషిబ్ శెట్టి అని పిలవండి అంటున్నారు.