తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విశాల్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. విశాల్ నటించిన కొన్ని సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఈయన కు మంచి గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే విశాల్ ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకుడు అయినటువంటి సుందర్ సి దర్శకత్వంలో కూడా రెండు సినిమాలలో నటించాడు. విశాల్ హీరో గా రూపొందిన మగ మహారాజు , మద గజ రాజా అనే రెండు సినిమాలకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. వీరి కాంబో లో మరో మూవీ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా సుందర్ సి , విశాల్ కు ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో సుందర్ దర్శకత్వంలో మరో సారి నటించడానికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుందర్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు , అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్లను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో విశాల్ కి జోడిగా తమన్నా ,  కాయదు లోహర్ ఇద్దరిని హీరోయిన్లుగా సెలెక్ట్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువలనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మరి ఈ కాంబో లో మూవీ ఉంటుందా ..? లేదా ..? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: