
రన్వీర్ సింగ్ – శ్రీలీల జంట స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ, ఎనర్జీ, స్టైలిష్ ప్రెజెంటేషన్ చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఈ కాంబినేషన్ సూపర్‌హిట్… ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ గ్యారంటీ!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ప్రశంసల మధ్య రన్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద వివాదానికి దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ —“నిజంగా చెప్పాలంటే, ఇండస్ట్రీలో నిజమైన నేషనల్ క్రష్ స్టార్ శ్రీలీలే. మేము యాడ్ కోసం కలిసి పని చేశాం. కానీ, ఆమెతో సినిమా చేయబోతున్నాను అన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే నాకు వందల కొన్ని వేల మెసేజ్‌లు వచ్చాయి. ఆమెకి ఇంత క్రేజ్ ఉంటుందని నాకు అప్పటివరకు తెలియదు. అప్పుడు అర్థమైంది — ఆమె నిజమైన నేషనల్ క్రష్ అని,”అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలో “నేషనల్ క్రష్ శ్రీలీలే” అనే భాగం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు “నేషనల్ క్రష్” అనే ట్యాగ్ దక్కింది రష్మిక మందన్నాకే. దాంతో రన్వీర్ సింగ్ మాటలను చాలామంది రష్మికను అవమానించే విధంగా, లేదా పరోక్షంగా ఎగతాళి చేసేలా భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రియాక్షన్లు వరుసగా వస్తున్నాయి. “రష్మిక ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యంతో రన్వీర్ ఇలా మాట్లాడాడా?”, “తన యాడ్‌ను ప్రమోట్ చేయడానికి పబ్లిసిటీ స్టంట్ చేస్తోన్నాడా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం రన్వీర్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటూ — “అతడు కేవలం శ్రీలీల ప్రతిభను మెచ్చుకున్నాడు అంతే, దాన్ని వివాదంగా మార్చడం అర్థంలేని పని” అంటూ సమర్థిస్తున్నారు.మొత్తం మీద రన్వీర్ సింగ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేస్తున్నాయి. శ్రీలీలకు వచ్చిన ప్రశంసలు పక్కన పెట్టినా, రష్మిక ఫ్యాన్స్ మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు “నేషనల్ క్రష్ ఎవరు?” అనే చర్చ మళ్లీ మొదలైంది.