సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అలా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్న వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒక రు. ఈయన తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా మొదట మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ వెళుతున్నాడు. వరుస పెట్టి విజయాలను అందుకుంటూ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపును ఈయన సంపాదించుకున్నాడు. ఈయన నటించి దర్శకత్వం వహించిన లవ్ టుడే సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.

ఈయన నటించిన డ్రాగన్ మూవీ ని తెలుగు లో విడుదల చేయగా అది కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. తాజాగా ఈయన నటించిన డ్యూడ్ మూవీ ని తెలుగు లో విడుదల చేయగా అది కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. దానితో ఈయన కు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈయన నటుడిగా అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక దర్శకుడిగా కూడా ఈయన ఓ తమిళ స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా ప్రదీప్ రంగనాథన్ ఓ సినిమా చేయబోతున్నట్లు అందులో భాగంగా ప్రస్తుతం విజయ్ తో  ప్రదీప్ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు అన్ని ఓకే అయితే విజయ్ ప్రదీప్ కాంబోలో ఓ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: